calender_icon.png 7 April, 2025 | 11:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాసేపట్లో సీతారాంబాగ్ కల్యాణోత్సవం

06-04-2025 11:46:06 AM

హైదరాబాద్,(విజయక్రాంతి): శ్రీరామనవమి సందర్భంగా సీతారాంబాగ్ లో కల్యాణోత్సవం కాసేపట్లో ప్రారంభంకానుంది. సీతారాంబాగ్ లోని కల్యాణోత్సవంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ పాల్గొననున్నారు. ప్రత్యేక పూజల అనంతరం శోభాయాత్ర ప్రారంభం కానుంది. శోభాయాత్ర దృష్ట్యా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సీతారాంబాగ్ నుంచి సుల్తాన్ బజార్ వరకు శ్రీరామనవమి శోభాయాత్ర 6.2 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. శోభాయాత్ర సందర్భంగా 20 వేల మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.