calender_icon.png 4 April, 2025 | 6:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

5 నాటికి నవమి ఏర్పాట్లు పూర్తి

02-04-2025 12:00:00 AM

  • భక్తులను ఎండ వేడిమి నుంచి కాపాడటానికి తొలిసారి మిక్స్‌డ్ ఫాగింగ్ యంత్రాలు ఏర్పాటు 

కలెక్టర్ జితేష్ వి పాటిల్ 

భద్రాచలం, ఏప్రిల్ 1 (విజయక్రాంతి):  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచ లంలో ఏప్రిల్ 6 తేదీ జరిగే సీతారామ కళ్యాణం, 7 వ తేదీ జరిగే పట్టాభిషేకం నకు ఏర్పాట్లు ఏప్రిల్ 5వ తేదీ నాటికి పూర్తి చేసి, కళ్యాణానికి సిద్ధంగా ఉంచుతామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ తెలిపారు. మంగళవారం భద్రాచల సీతారాముల కళ్యాణం ఏర్పాట్లు మిథిలా స్టేడియంలో పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.

భద్రాచలంలో ఎండ వేడి ఎక్కువగా ఉన్నందున భక్తులు ఇబ్బందులు పడకుండా తొలిసారి మిక్సిడ్ పాగింగ్ యంత్రాలు ద్వారా చల్లపరిచే కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. అదేవిధంగా ముఖ్యమంత్రి తో పాటు మంత్రులు హైకోర్టు జడ్జీలు వీవీఐపి అధికారులు వచ్చే అవకాశం ఉన్నం దున వారందరూ ప్రశాంతంగా కళ్యాణం వీక్షించి వెళ్లేలా పోలీస్ శాఖ విస్తృత స్థాయి లో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు.

జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ భద్రాచలం ఎస్పి విక్రాంత్ కుమార్ సింగ్ లు స్వయంగా పరిశీలించి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.ముఖ్యంగా వీఐపీలు అధిక సంఖ్యలో కళ్యాణం వీక్షించేందుకు వస్తున్నందున వారి హోదాకు తగ్గట్లు వారిని కూర్చో బెట్టేందుకు ఐటీడీఏ పీవో రాహుల్ ఆర్డిఓ దామోదర్ రావు ఏ ఎస్ పి విగ్రహం కుమా ర్ సింగ్ దేవస్థానం ఈవో రమాదేవి తో మాట్లాడి మంచి ప్రణాళిక తయారు చేసినట్టు తెలిపారు.

వచ్చిన వీఐపీలు లతో పాటు భక్తులు ప్రశాంతంగా కళ్యాణం చూ సేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల సహకారం ఐటిసి సహకారంతో భక్తులకు మండపంలోనూ పట్టణం లోనూ మంచినీళ్లు మజ్జిగ అందజేస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు.

భద్రాచలం పుణ్యక్షేత్రాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణముగా చేయ డానికి ప్రయత్నాలు చేస్తున్నామని భక్తులు కూడా ప్లాస్టిక్ వాడకుండా క్లాత్ బ్యాగ్స్ వా డాలని ఈ సందర్భంగా కోరారు. కలెక్టర్ పర్యటనలో ఐటీడీఏ పీవో రాహుల్, ఎస్పీ రోహిత్ రాజ్ , ఏ ఎస్ పి విక్రాంతి కుమార్ సింగ్, ఆర్డీవో దామోదర్ రావు దేవస్థానం ఈవో ఎల్ రామా దేవి పాల్గొన్నారు.