calender_icon.png 6 November, 2024 | 2:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హనుమాన్ ఆలయంలో నవగ్రహ విగ్రహాలు ధ్వంసం

06-11-2024 02:16:51 AM

శంషాబాద్ ఎయిర్‌పోర్టు కాలనీలో ఘటన 

రాజేంద్రనగర్, నవంబర్ 5: శంషాబాద్ ఎయిర్‌పోర్టు కాలనీలోని హనుమాన్ ఆలయంలో ఉన్న నవగ్రహ విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. మంగళవారం తెల్లవారుజామున ఆలయ పూజారితో పాటు స్థానికులు చూడగా విగ్రహాలు ధ్వం సమై ఉన్నాయి. విషయం తెలుసుకున్న ఆర్‌జీఐఏ పోలీసులు ఘటనా స్థలానికి చేరు కొని వివరాలు సేకరించారు. అయితే, కొన్నిరోజులుగా ఓ వ్యక్తి ఆలయ పరిసరాల్లో తిరుగుతూ కనిపించాడని స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

విగ్రహాల ధ్వంసం విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఆలయాన్ని పరిశీలించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్ నాయకులు ఆల యం వద్దకు భారీగా చేరుకున్నారు. వరుస ఘటనలు జరుగుతున్నా కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.

ఓ వర్గానికి కొమ్ముకాస్తున్న సర్కారు : బండి సంజయ్

విగ్రహాల ధ్వంసాన్ని బీజేపీ ఖండిస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓ వర్గానికి కాంగ్రెస్ పార్టీ కొమ్ముకాస్తుందని ధ్వజమెత్తారు. ముత్యాలమ్మ, హనుమాన్ ఆలయంలో విగ్రహాలు ధ్వంసం చేసినా పట్టించుకోవడం లేదన్నారు. సీఎం, రాష్ట్ర మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అదే ఇతర మతాలకు సంబంధించినది జరిగితే పరిస్థితి మరోలా ఉండేదని, సౌదీ, పాకిస్తాన్ నుంచి చైర్మన్లు వచ్చేవారని ఎద్దేవా చేశారు.