calender_icon.png 18 November, 2024 | 9:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నట్వర్ సింగ్ కన్నుమూత

12-08-2024 12:29:34 AM

యూపీఏ-1లో విదేశాంగ మంత్రిగా కీలక బాధ్యతలు

ఢిల్లీలో పూర్తయిన అంత్యక్రియలు

న్యూ ఢిల్లీ, ఆగస్టు 11: మాజీ విదేశాంగ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత నట్వర్ సింగ్ (93) శనివారం రాత్రి కన్నుమూశారు. ఢిల్లీ  సమీపంలోని గురుగ్రామ్‌లో మేదాంత ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజు లుగా తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. నట్వర్‌సింగ్  1931లో రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్‌పూర్‌లో జన్మించారు. జాట్ హిందువులైన వీరు భరత్‌పూర్   రాజవంశ కుటుంబీ కులు. గ్వాలియర్‌లోని సింధియా స్కూల్, అజ్మీర్‌లోని మయో కాలేజ్‌లో ఆయన విద్యనభ్యసించారు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో డిగ్రీ పూర్తిచేశారు. 

ఐఎస్‌ఎఫ్‌గా కెరీర్ ప్రాంభం..

1953లో ఆయన ఐఎఫ్‌ఎస్(ఇండియన్ ఫారెన్ సర్వీసెస్)కు ఎంపికయ్యారు. చైనా, అమెరికా, పాకిస్థాన్, యూకే సహా పలు దేశాల్లో రాయబారిగా కీలక పదవుల్లో పనిచేశారు. 1966 వరకు ఇందిరా హయా ంలో పాకిస్థాన్ రాయబారిగా,  2004 కాలానికి ప్రధాని మన్మోహన్‌సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో భారత విదేశాంగ మంత్రిగా ఆయన పనిచేశారు. 1984లో నట్వర్‌సింగ్‌ను ప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించింది.  

రాజకీయ జీవితం..

నట్వర్‌సింగ్ 1984లో ఉద్యోగానికి రాజీనామా చేసి.. కాంగ్రెస్ తరఫున భరత్‌పూర్ జిల్లానుంచి లోక్‌సభకు పోటీచేసి గెలుపొందారు. 1985లో ఉక్కు, బొగ్గు, గనులు, వ్యవసాయ శాఖల్లో సహాయమంత్రిగా పనిచేశారు. అయితే విదేశాంగ వ్యవహారాల్లో ఆయన అనుభవాన్ని గుర్తించిన అప్పటి ప్రభుత్వం 1986లో విదేశాంగ శాఖ సహాయమంత్రిగా నియమించింది. తదనంతరం కొంతకాలం ఆయన పార్టీకి, రాజకీయాలకు దూరంగా ఉండగా.. రాజకీయాల్లో సోని యాగాంధీ అరంగేట్రంతో నట్వర్‌సింగ్ మళ్లీ రాజకీయాల్లోకి వచ్చారు.  2004లో దేశాంగ శాఖ బాధ్యతలు స్వీకరించారు. ఓ పథకానికి సంబంధించి ఒప్పందంలో వ్యక్తిగత లబ్ధిపొందారనే ఆరోపణలతో పదవి చేపట్టిన ఏడాదిన్నరకే రాజీనామా చేశారు.