calender_icon.png 4 October, 2024 | 4:52 AM

స్త్రీలకు శాపంగా ప్రకృతి విపత్తులు

04-10-2024 01:36:33 AM

వాతావరణ మార్పులతో పెరుగుతోన్న గృహహింస

సన్నిహితంగా ఉండేవారి నుంచే అధిక ప్రమాదం

విపత్తు నిర్వహణలో మహిళకు ప్రాధాన్యం కల్పించాలి

లండన్ యూనివర్సిటీ కాలేజీ అధ్యయనం

న్యూఢిల్లీ, అక్టోబర్ 3: వాతావరణ మార్పులు మహిళలపై గృహహింసకు దారితీస్తాయంటే నమ్మశక్యం కాకపోవచ్చు. కానీ ఇది నిజమేనని యూనివర్సిటీ కాలేజీ లండ న్ (యూసీఎల్) అధ్యయనంలో వెల్లడైంది. 156 దేశాల్లో వాతావరణ అంశాలకు ముడిపడిన అంశాలపై విశ్లేషించి అధ్యయన బృం దం తుపాన్లు, కొండచరియలు విరిగిపడ టం, వరదలు, భూకంపాల సమయంలో శారీరక వేధింపులు, లైంగిక హింసలు పెరిగాయని గుర్తించింది.

తక్కువ జీడీపీ ఉన్న దేశాల్లో ఈ పరిస్థితులు అధికంగా ఉన్నట్లు పేర్కొంది. పితృస్వామ్యం, మహిళలపై హిం సను సాధారణంగా చూసే ప్రాంతాల్లో లైంగికదాడులు విస్తృతంగా జరుగుతున్నాయని తమ అధ్యయనంలో తేలిందని ప్రొఫెసర్ జెనీవీవ్ మన్నెల్ పేర్కొన్నారు. 

పేద దేశాల్లోనే అధికం

ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు బయటి వ్యక్తుల కన్నా సన్నిహితంగా ఉండేవారే అధికంగా ఈ చర్యలకు పాల్పడుతు న్నారని అధ్యయనంలో తేలింది.  1993 నుం చి 2019 వరకు 156 దేశాల్లో ఈ డాటాను సేకరించారు. తుపాన్లు, కొండచరియలు  ఘటనలు ఎక్కువగా జరిగినట్లు ఈ అధ్యయనం గుర్తించింది.

కానీ భూకంపాలు, కార్చిచ్చు వంటి ఘటనలకు సంబంధించి స్పష్టమైన సమాచారం లేదని పేర్కొంది. అధిక జీడీపీ ఉన్న దేశాల్లో ఇలాంటి నేరాల శాతం తక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. ఆఫ్రికాలోని కాంగోలో సన్నిహితులు లేదా భాగస్వాము లు ద్వారా జరిగే అత్యాచారాలు (ఐపీవీ) అధికంగా ఉన్నాయని అధ్యయనం తెలిపింది. తర్వాతి స్థానాల్లో ఇథియోపియా, పపువా న్యూగినియా ఉన్నాయి. 

విధానాల్లో మార్పులు అవసరం

ఈ అంశాల్లో పరిశోధన ఫలితాలు అస్పష్టంగా ఉన్నప్పటికీ అధిక వేడి, తేమ వల్ల హింసను పెంపొందిస్తున్నాయని నివేదిక గుర్తిస్తోంది. ప్రకృతి విపత్తుల వల్ల ఒత్తిడి, ఆహార అభద్రత పెరిగి తద్వారా హింసకు దారి తీస్తున్నట్లు వెల్లడించింది. విపత్తుల సమయంలో పోలీసులు, పౌర సమాజం సైతం సామాజిక సేవలు తగ్గించడం వల్ల ఈ పరిస్థితులు నెలకొంటు న్నాయని, అదే సమయంలో లైంగిక హింస పెరుగుతోందని అధ్యయనం అంచనా వేసింది.

ఇందుకు ప్రభుత్వాలు ఏర్పాటు చేసే అసురక్షితమైన ఆశ్రయా లు కూడా కారణమని పేర్కొంది. ఈ అం శంలో ముందుగా ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని అధ్యయ నం సూచించింది. అంతేకాకుండా మహిళలపై జరిగే నేరాలపై దృష్టి సారించాలని, వాళ్లకు ఆర్థికంగా తోడ్పాటును అందించాలని పేర్కొంది. లేదా విపత్తు సమయా ల్లో మహిళలకు ప్రత్యేక రక్షణ కల్పించాలని సూచించింది. విపత్తు నిర్వహణ విధానంలో మహిళల రక్షణకు స్థానం కల్పించాలని ప్రతిపాదిస్తోంది.