- ఆర్డీవో వెంకటరెడ్డి
రాజేంద్రనగర్: జాతీయ ఓటరు దినోత్సవం(National Voters' Day) సందర్భంగా రాజేంద్ర నగర్ మండలం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ర్యాలీ నిర్వహించి అనంతరం ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్బంగా రాజేంద్ర నగర్ ఆర్. డి.ఓ, ఇ.ఆర్. ఓ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. 18 సం.లు నిండిన యువతి, యువకులు ప్రతి క్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఇది రాజ్యాంగము కల్పించిన హక్కు అన్నారు. తహశీల్దార్, ఎ.ఇ.ఆర్.ఓ బొమ్మ రాములు మాట్లాడుతూ.. ఓటరు గా నమోదైన ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరినారు. కార్యక్రమంలో ఉప తహశీల్దార్ రవి కుమార్, క్రాంతి కమార్, కళాశాల ప్రిన్సిపాల్ సుధారాణి మరియు సిబ్బంది పాల్గొన్నారు.