అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్
కుమ్రంభీంఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఓటు హక్కు పౌరులకు వజ్రాయుధం లాంటిదని అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్ అన్నారు. జాతీయ ఓటర్ దినోత్సవం(National Voters' Day) సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ నుండి అంబేద్కర్ చౌక్ వరకు టూ కె రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య నిర్మాణంలో ఓటుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఓటు ద్వారా అవినీతి లేని పాలనను నిర్మించుకోవచ్చు అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని సూచించారు. విద్యార్థి దశ నుండే ఓటు , ప్రజాస్వామ్య విలువలు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. కలెక్టరేట్ ఎదుట మహిళా సంఘాలు సభ్యులు,అంగన్వాడి టీచర్లు, కలెక్టరేట్ మైహిళ సిబ్బంది ముగ్గుల పోటీలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ దత్తారావు, ఆర్డిఓ లోకేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు.