calender_icon.png 15 January, 2025 | 6:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

05-09-2024 07:56:57 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాలలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్  మైసూరు విశ్వవిద్యాలయము నుంచి కలకత్తా విశ్వవిద్యాలయమునకు కులపతిగా వెలుతున్న సమయంలో మైసూరు విశ్వవిద్యాలయం విద్యార్ధులు ఆయన వెలుతున్న గుర్రపుబండిని తామే లాగుతూ రైల్వే స్టేషన్ వరకు తీసుకుని వెళ్లారు. ఈ అద్భతమైన సంఘటనను మిమ్స్ ప్రైమ్ స్కూల్ విద్యార్ధులు ప్రదర్శనగా చేశారు. ఈ ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో మిమ్స్ సంస్థల డైరెక్టర్స్ ఉపేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు, శ్రీధర్ రావు, విజయకుమార్, ఉపాధ్యాయులు, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.