బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని బాలగంగాధర్ తిలక్ క్రీడా మైదానంలో మంగళవారం సాయంత్రం జాతీయ సాఫ్ట్ బేస్డ్ బాల్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఇందుకుగాను సాఫ్ట్ బేస్డ్ బాల్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పులియాల రవికుమార్ ఆధ్వర్యంలో క్రీడా పోటీల ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాటు చేపడుతున్నారు. ఈ క్రీడా పోటీల ప్రారంభానికి బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్, జాతీయ సాఫ్డ్ బేస్డ్ బాల్ సెక్రటరీ నాందేవ్ షిండే, మంచిర్యాల కలెక్టర్ దీపక్ కుమార్, మున్సిపల్ అధ్యక్షురాలు జక్కుల శ్వేత హాజరుకానున్నారు. పోటీల్లో 12 రాష్ట్రాలలోని అసోసియేషన్ సెక్రటరీలు, 400 మంది క్రీడాకారులు పాల్గొనబోతున్నారు.