calender_icon.png 4 April, 2025 | 6:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆనంద్ కృష్ణారెడ్డికి జాతీయ సేవా రత్న అవార్డు

16-12-2024 10:25:20 PM

పటాన్ చెరు: జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ కు చెందిన ప్రముఖ సంఘ సేవకుడు, కేజేఆర్ ఫౌండేషన్ అధినేత ఆనంద్ కృష్ణారెడ్డికి జాతి సేవా రత్న అవార్డు లభించింది. కేజేఆర్ ఫౌండేషన్ ద్వారా ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించిన బహుజన సాహిత్య అకాడమీ సంస్థ ఈ అవార్డును అందజేసింది. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో సాహిత్య అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ ఆనంద్ కృష్ణారెడ్డికి ఈ అవార్డును ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆనంద్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. జాతీయ సేవారత్న అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. కేజేఆర్ ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని ఆయన చెప్పారు. అవార్డు ప్రధానోత్సవం చేసిన సంస్థకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.