calender_icon.png 31 March, 2025 | 5:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గీతంలో విజయవంతంగా ముగిసిన జాతీయ సెమినార్‌

29-03-2025 12:56:11 AM

ప‌టాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో మార్చి 26 నుంచి 28 వరకు ‘పదార్థాల నిర్మాణ విశ్లేషణ కోసం ఎక్స్-రే విక్షేపం’ (ఎక్స్-రే డిఫ్రాక్షన్ ఫర్ స్ట్రక్చరల్ అనాలిసిస్ ఆఫ్ మెటీరియల్స్) అనే అంశంపై మూడు రోజుల జాతీయ సెమినార్‌ విజయవంతంగా నిర్వహించింది. దీని ముగింపు సమావేశం శుక్రవారం జ‌రిగింది. ఈ సెమినార్ కు దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రతినిధుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సెమినార్‌ ఎక్స్-రే డిఫ్రాక్షన్ (ఎక్స్ఆర్డీ) పద్ధతుల యొక్క లోతైన అన్వేషణను అందించింది. నిపుణుల ఉపన్యాసాలతో పాటు ఆచరణాత్మక శిక్షణ జతకలిసి, ఇందులో పాల్గొన్న వారికి నిర్మాణాత్మక విశ్లేషణలో అవసరమైన నైపుణ్యాలతో సన్నద్ధం చేసింది. ఐఐటీ హైదరాబాదులోని మెటీరియల్స్ సైన్స్, మెటలర్జికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రఖ్యాత విద్యావేత్త ప్రొఫసర్ రంజిత్ రామదురై ఈ కార్యక్రమంలో ప్రధాన వక్త, శిక్షకుడిగా వ్యవహరించారు.

ఎక్స్-రే డిఫ్రాక్షన్, డిఫ్రాక్టోమీటర్ జ్యామితి, అధునాతన పీక్ విశ్లేషణ పద్ధతుల యొక్క ప్రాథమిక సూత్రాలను ఆయా ప్రతినిధులు తెలుసుకున్నారు. ఈ మూడు రోజుల నిర్విరామ కార్యక్రమంలో ప్రతినిధులందరినీ ఉత్సాహంగా ఉంచడమే గాక, ఎంతో విలువైన సమాచారాన్ని, బోధనానుభవాన్ని అలుపెరగకుండా పంచిన ప్రొఫెసర్ రంజిత్ రామదురైని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రెజా శాలువ, జ్జాపికలతో సత్కరించారు. నిర్మాణాత్మక, ప్రభావవంతమైన అభ్యాస అనుభవాన్ని అందించిన ఈ సెమినార్‌ భౌతిక శాస్త్ర విభాగ అధ్యాపకులు డాక్టర్ కె.విజయానందిని, డాక్టర్ సయాన్ చౌదని సమన్వయం చేశారు. ఈ మూడు రోజుల సెమినార్ లో దేశవ్యాప్తంగా పలువురు పరిశోధకులు, అధ్యాపకులు, పీజీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యంగా ఎక్స్-రే డిఫ్రాక్షన్ (ఎక్స్ఆర్డీ) పద్ధతులలో శిక్షణ పట్ల వారు తమ సంతృప్తిని వ్యక్తం శారు. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లో విద్యా, పరిశోధన పర్యావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేశారు.