27-02-2025 01:10:54 AM
పటాన్ చెరు, ఫిబ్రవరి 26 : గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్‌ఎస్)లోని ఆంగ్ల ఇతర భాషల విభాగం ఆధ్వర్యంలో ‘అనువాదం: చరిత్ర, తేడాలు, పునరుద్ధరణలు’ అనే అంశంపై నిర్వహిస్తున్న మూడు రోజుల జాతీయ సెమినార్ ను డైరెక్టర్ ప్రొఫెసర్ సన్నీ జోస్ బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ సెమినార్ లో హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుంచి విశిష్ట పూర్వ ప్రొఫెసర్లు అల్లాడి ఉమా, ఎం.శ్రీధర్; మధురై కామరాజ్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ జె.బాలసుబ్రమణ్యం; పశ్చిమ బెంగాల్ రాష్ట్ర విశ్వవిద్యాలయం నుంచి ప్రొఫెసర్ సిప్రా ముఖర్జీ, స్వతంత్ర స్కాలర్ అనువాదకురాలు, కార్యకర్త వి.గీత తదితర ముఖ్యులు పాల్గొంటున్నారని గీతం ప్రతినిధులు తెలిపారు.
ప్రొఫెసర్ ఉమా, ప్రొఫెసర్ శ్రీధర్ ‘అనువాదం, చర్చలు, సమస్యలు, సవాళ్లు’, ‘అనువాద సాధనలో గుర్తింపులు, తేడాలు, మార్జినాలిటీలు’ అనే అంశాలపై ఆలోచింపజేసే ఉపన్యాసాలు ఇచ్చారు. ‘తమిళ కుల వ్యతిరేక రచన: ఆలోచనలు, అనువాద నెట్ వర్క్’ అనే సెషన్లో డాక్టర్ బాలసుబ్రమణ్యం భాష, సామాజిక న్యాయం యొక్క ఖండనలను వివరించారు.