04-03-2025 06:15:55 PM
బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్
మందమర్రి,(విజయక్రాంతి): రహదారి భద్రత నిబంధనలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నివారించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బెల్లంపల్లి ఎసిపి రవికుమార్ ఆన్నారు. 54వ జాతీయ భద్రతా వారో త్సవాలు 2025ని పురస్కరించుకొని మంగళవారం పట్టణంలోని జాతీయ రహదారి టోల్ గేట్ దగ్గర జాతీయ రహదారి అధికారులు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 54వ జాతీయ భద్రత వారోత్సవాలలో భాగంగా రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన పెంచి, ప్రమాదాలను నివారిం చేందుకు 1971లో నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(National Safety Council of India) ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఆయన గుర్తు చేశారు.
దీనిలో భాగంగా ప్రతి సంవత్సరం మార్చి 4న జాతీయ భద్రతా దినోత్సవాన్ని జరుపు కుంటున్నామన్నారు. రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన ప్పటికి గత సంవత్సరం బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలో 363 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల ద్వారా 54 మంది మరణించ డం బాధాకరమన్నారు. రాత్రి సమయంలో రహదారులపై వాహనాలు నిలిపి ఉంచడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని అన్నారు. వాహనదారులకు రోడ్డు ప్రమాదాలపై నిరంతరం అవగాహన కల్పిస్తున్నామని, సంబంధిత అధికారులు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్ పెక్టర్ శశిధర్ రెడ్డి, ఎస్సై రాజశేఖర్, కాసిపేట ఎస్ఐ ప్రవీణ్ , జాతీయ రహదారి నిర్వహణ అధికారులు సునీల్ , సిబ్బంది, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.