నిజామాబాద్ (విజయక్రాంతి): జాతీయ భద్రత మాస ఉత్సవాల్లో భాగంగా సోమవారం నిజామాబాద్ శివాజీ నగర్ లో గల రామకృష్ణ ఉన్నత పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిరణ్ మాట్లాడుతూ... మైనర్లు బైకులు నడపవద్దని చట్ట ప్రకారం మైనర్లు ద్విచక్రవాహనాలు నడిపితే నేరమని ఆయన విద్యార్థులకు తెలిపారు. హెల్మెట్ తో పాటు లైసెన్సు ఇన్సూరెన్స్ తో పాటు సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడపకూడదన్నారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించి సురక్షితంగా ప్రయాణం చేయలని విద్యార్థులకు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు కిరణ్, రాహుల్ ఐరాడ్ జిల్లా మేనేజర్ వర్షా నిహాంత్ తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.