28-02-2025 06:56:12 PM
ఆలోచింపచేసిన విద్యార్థుల ప్రయోగాలు..
ఇల్లెందు (విజయక్రాంతి): ఇల్లందు పట్టణంలోని మార్గదర్శిని గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో జాతీయ సైన్స్ డే ను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జాతీయ సైన్స్ డే ను పురస్కరించుకుని విద్యార్థులు స్వయంగా వివిధ ప్రయోగాలను తయారు చేశారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సైన్స్ పరిజ్ఞానాన్ని సైన్స్ డే ద్వారా ప్రయోగాల రూపంలో బయటికి వచ్చాయని పాఠశాల డైరెక్టర్లు దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, యాదగిరి రాంబాబు, ఆరవపల్లి రాధాకృష్ణ తెలిపారు.
భవిష్యత్తు మొత్తం సైన్స్ పైనే ఆధారపడి ఉందని తరగతి గదుల్లో విద్యార్థులు నేర్చుకున్న పాఠ్యాంశాలను ప్రయోగాత్మకంగా బయటపెట్టడం గొప్ప విషయం అన్నారు. విద్యార్థులు రూపొందించిన 100కు పైగా ప్రయోగాలు ఎంతగానో ఆలోచింప చేసే విధంగా ఉన్నాయని తెలిపారు. సైన్స్ డే ను పురస్కరించుకొని సివి రామన్, ఐన్ స్టీన్, మేడం క్యూరీ, న్యూటన్ శాస్త్రవేత్తల వేషధారణలు ఆకట్టుకున్నాయి. ఈ సైన్స్ డే కార్యక్రమంలో ఉపాధ్యాయులు యాస్మిన్, సాగరిక, హరిత, వీరన్న, ఓ.వెంకన్న, గోపి, రోజా, షాహిద తదితరులు పాల్గొన్నారు.