04-03-2025 08:33:54 PM
మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని కార్మెల్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం పాఠశాల ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని రంగోలి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు భౌతిక రసాయన శాస్త్రాలు, జీవ శాస్త్రాలులోని వివిధ పాఠ్యాంశాల పటాలను విద్యార్థులు గీశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ ఫాదర్ జెవిఆర్ రెక్స్ జె, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఎమ్ కుమారస్వామి, జీవశాస్త్ర ఉపాధ్యాయిని ఐ సునీత, సైన్స్ ఉపాధ్యాయులు, పిఈటి కృష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు.