28-02-2025 06:27:45 PM
మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్ లక్ష్మీనగర్ బ్రాంచ్ లో శుక్రవారం నేషనల్ సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో సైన్స్ ఎగ్జిబిషన్, విజ్ఞాన సంబంధిత కార్యక్రమాలను విద్యార్థులు నిర్వహించారు. ఈ ఎగ్జిబిషన్‌ను మంచిర్యాల ఎస్సై సిహెచ్ కిరణ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరై రెబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పిల్లలు వర్కింగ్ మాడ్యూల్స్, నీటిని ఎలా సంరక్షించాలనే దానిపై ప్రాజెక్ట్‌లను సిద్ధం చేసి ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఎజిఎం అరవింద్ రెడ్డి, ప్రిన్సిపాల్ ఆయుబ్, కో ఆర్డినేటర్ నాగరాజు, డీన్ ప్రియాంక, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.