01-03-2025 12:06:30 AM
కొత్తపల్లి, ఫిబ్రవరి 28: కరీంనగర్ పట్టణంలోని వావిలాలపల్లిలో గల సెయింట్ పాల్స్ పాఠశాలలో శుక్రవారం జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు చేసిన నమూనాలు ప్రదర్శనలను పాఠశాల చైర్మన్ M. రాజ్ కుమార్, ప్రిన్సిపల్ లీన ప్రియదర్శిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎన్ నాగరాజు, ఎండి అహ్మద్ , నాన్సీ నీలిమ , ఉపాధ్యాయిని , ఉపాధ్యాయులు పాల్గొన్నారు.