calender_icon.png 1 March, 2025 | 2:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం..

28-02-2025 09:19:05 PM

మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియాలోని పివి కాలనీ సింగరేణి ఉన్నత పాఠశాలలో శుక్రవారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పాఠశాల ఇంచార్జ్ హెచ్ ఎం ఆర్ కళ్యాణి డాక్టర్ సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి వేడుకలను ప్రారంభించారు. ఇందులో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన సైన్స్ ప్రాజెక్టులను పరిశీలించారు. దీంతోపాటు పిరియాడిక్ టేబుల్ లో ఎలిమెంట్స్ యొక్క ప్రాధాన్యతను వివరించే నాటికను విద్యార్థులు ప్రదర్శించారు.

ఈ సందర్భంగా ఇన్చార్జి హెచ్ఎం కళ్యాణి విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ.. సైన్స్ అండ్ టెక్నాలజీ మానవాళి మనుగడకు ఉపయోగపడాలని భారతదేశం సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రపంచ దేశాల్ని శాసించే స్థాయికి ఎదగాలని, ఆ దిశగా ప్రతి విద్యార్థి అన్వేషణ, పరిశోధన, పరిశీలన ధోరణిని పెంపొందించుకోవాలని సూచించారు. ఆ విధంగా విద్యార్థులు ముందుకు సాగితే నూతన ఆవిష్కరణలు సాధించేందుకు దోదపడతాయన్నారు. ఆ దిశగా విద్యార్థులను తీసుకు వెళ్లాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని గుర్తు చేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.