01-03-2025 08:09:11 PM
నాగల్ గిద్ద (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా నాగల్ గిద్ద మండలంలోని శ్రీ గాయత్రి ఉన్నత పాఠశాలలో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంగమేశ్వర, కరస్పాండెంట్ హన్మంతు రావు పాటిల్, డాక్టర్ సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి వేడుకలను ప్రారంభించారు. ఇందులో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన సైన్స్ ప్రాజెక్టులను పరిశీలించారు.
ఈ సందర్భంగా కరెస్పాండెంట్ హనుమంతరావు పాటిల్ విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ.. సైన్స్ అండ్ టెక్నాలజీ మానవాళి మనుగడకు ఉపయోగపడాలని భారతదేశం సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రపంచ దేశాల్ని శాసించే స్థాయికి ఎదగాలని, ఆ దిశగా ప్రతి విద్యార్థి అన్వేషణ, పరిశోధన, పరిశీలన ధోరణిని పెంపొందించుకోవాలని సూచించారు. ఆ విధంగా విద్యార్థులు ముందుకు సాగితే నూతన ఆవిష్కరణలు సాధించేందుకు దోదపడతాయన్నారు. ఆ దిశగా విద్యార్థులను తీసుకు వెళ్లాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని గుర్తు చేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.