13-03-2025 10:17:44 PM
ఉపాధిహామీపథకంపనిలో సమయపాలనపాటించాలి ఫీల్డ్ అసిస్టెంట్ దొడ్డారపు నాగేశ్వరరావు
మునగాల: మండల పరిధిలోని కలకోవ గ్రామంలో జాతీయ గ్రామీణఉపాధిహామీ పథకంకింద పారంపాండు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఉపాధిహామీపనిలో జాబ్ కార్డు కలిగి, ఆధార్ కార్డు లింక్ చేసుకున్న ప్రతిఒక్కరికి ఉపాధిహామీలో పనిచేసేఅవకాశంఉందని, తమ పేర్లను నమోదుచేయించుకొని, పని చేయొచ్చని స్థానిక ఫీల్డ్ అసిస్టెంట్ దొడ్డారపు నాగేశ్వరరావు తెలిపారు. ప్రతి కూలి సమయపాలన పాటించి తమకు కేటాయించిన పనులను కొలతల ప్రకారం చేయాలని కూలీలకు సూచించారు, ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు మెట్లు తదితరులుపాల్గొన్నారు.