calender_icon.png 19 January, 2025 | 10:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమాద రహిత పట్టణంగా కొత్తగూడెంను తీర్చి దిద్దుదాం

19-01-2025 06:59:06 PM

ట్రాఫిక్ నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత

రోడ్డు భద్రత వారోత్సవాల సదస్సులో ఎమ్మెల్యే కూనంనేని, ఎస్పీ రోహిత్ రాజ్

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): సమన్వయంతో పనిచేసి కొత్తగూడెం పట్టణాన్ని ప్రమాద రహిత పట్టణంగా తీర్చి దిద్దుదామని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు(MLA Kunamneni Sambasiva Rao), జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్(SP Rohit Raj) అన్నారు. జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలను పురస్కరించుకోని కొత్తగూడెం క్లబ్బులో ఆదివారం జరిగిన పొలిసు సిబ్బంది, వ్యాపారస్తులు, ప్రైవేటీ వాహన డ్రైవర్లు, పట్టణ ప్రముఖులతో ఏర్పాటు చేసిన సదస్సుకు వారు ముఖ్య అతిధులుగా పాల్గొని మాట్లాడారు. ట్రాఫిక్ నియంత్రణ కేవలం పోలీసులదే కాదని  ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలన్నారు. డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలు పాటించి ప్రమాదాల నియంత్రణకు సహకరించాలని, మద్యం, నిర్లక్ష్యం ప్రమాదాలకు ప్రధాన కారణమని వాహదారులు గుర్తించి నడుచుకోవాలన్నారు. రోడ్ల అభివృద్ధికి తగినన్ని నిధులు రాబడుతున్నామని, రోజురోజుకు పెరుగుతున్న వాహనాల సంఖ్యకు అనుగుణంగా రోడ్లను అభివృద్ధి చేసుకువాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి సెంటర్లు ప్రమాదాలను గుర్తించేందుకు సిసి కెమెరాలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.

పార్కింగ్ స్థలాల ఏర్పాటుకోసం ప్రభుత్వ శాఖలు స్థలాలను అన్వేషించి నీవెందిక అందించాలని సూచించారు. చిరువ్యాపారులు రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు ఏర్పాటు చేయడంవల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయని, నిబంధనలు పాటించి షాపులు ఏర్పాటు చేసికువాలని సూచించారు. కార్పొరేషన్ ఏర్పాటుతో పొలిసు శాఖ, రోడ్డు ట్రాఫిక్ శాఖ, మున్సిపల్ శాఖపై మరింత బాధ్యత పెరుగుతోందని, సమన్వయంతో పనిచేసి సమస్యలను అధిగమించాలని కోరారు. అనంతరం రోడ్డు భద్రత వారోత్సవాల ప్రచార కరపత్రాలను విడుదల చేశారు. కొత్తగూడెం డిఎస్పీ అబ్దుల్ రహమాన్ అధ్యక్షతన జరిగిన సదస్సులో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, తహసీల్దార్ పుల్లయ్య, ఆర్టీవో వెంకటనారాయణ, ఆర్ అండ్ బి డి ఈ, నాగేశ్వర్ రావు, కమిషనర్ శేషాంజనస్వామి, ఆర్టీసీ డిపో మేనేజర్, వేందర్ గౌడ్, వార్డు కౌన్సిలర్లు కంచర్ల జమలయ్య, వంగ వెంకట్, రమణమూర్తి, వి మల్లికార్జునరావు, భూక్యా శ్రీనివాస్, ధర్మరాజు, పల్లపోతు సాయి, అబిద్,  వాసిరెడ్డి మురళి, కందుల భాస్కర్,  రత్నకుమారి,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.