calender_icon.png 23 January, 2025 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

22-01-2025 11:41:02 PM

కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ ఇందిరా...

కామారెడ్డి (విజయక్రాంతి): ప్రతి విద్యార్థి రోడ్డు భద్రత నియామాలు పాటించాలని కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ ఇందిరా తెలిపారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లింగంపేట గురుకుల పాఠశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. రోడ్డు భద్రత నియామాలు తెలుసుకొని వాహనాలను నడపాలని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లేటప్పుడు రోడ్డు నియమాలు పాటించాలని కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ ఇందిరా సూచించారు. అనంతరం రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా  కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లిలో గల తెలంగాణ ఉమెన్స్ రెసిడెన్షియల్‌లో రోడ్డు భద్రత నియామల గురించి వివరించారు. పిల్లకలు రోడ్డు భద్రతపై వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. గెలుపొందిన విద్యార్థినులకు మొదటి బహుమతి రోష్ట, రెండవ బహుమతి శ్రీవర్షని, మూడో బహుమతి సంజనకు డిపో మేనేజర్ ఇందిరా చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిపో మెకానికల్ పోర్‌మెన్ సమీర్ తదితరులు పాల్గొన్నారు.