calender_icon.png 25 January, 2025 | 4:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉన్నత పాఠశాలలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం

24-01-2025 10:56:56 PM

మహదేవపూర్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జనవరి 1వ తేదీ నుండి జనవరి 31 తేదీ వరకు  నిర్వహిస్తున్న జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం 2025 లో భాగంగా శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం సూరారం గ్రామంలోని ఉన్నత పాఠశాలలో రోడ్డు భద్రత గురించి జిల్లా రవాణా శాఖ అధికారి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  విచ్చేసిన జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీ  మొహమ్మద్ సమ్ధాని, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుందర్లాల్  పాఠశాల విద్యార్థులతో సమావేశమై మన దేశంలో మోటారు వాహనాల వల్ల ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో రహదారి ప్రమాదాలు నానాటికి అధికమవుతున్నాయని, ఈ నవ నాగరిక ఆధునిక వేగవంతమైన సమాజము, కంప్యూటర్ యుగంలో ప్రతి వ్యక్తికి మోటార్ వాహనం అవసరం అయినది.

మోటారు వాహనాలను సరైన కండిషన్లో ఉంచుకొని వాహన దారులు నిర్లక్ష్య వైఖరిని విడనాడి అతివేగం వలన బాధ్యత రాహిత్యంగా రోడ్లపై వాహనాలు నడపడం వలన ఏర్పడే ప్రమాదాలను పిల్లలకు వివరించారు. రోడ్డు భద్రతకు సంబంధించిన నియమాలు, ప్రమాదాలు జరగకుండా పాటించవలసిన జాగ్రత్తలు, తమ కుటుంబాలలో ఉన్నటువంటి పెద్దలందరికీ తెలియజేయాలని, హెల్మెట్ సీటు బెల్టు యొక్క ఆవశ్యకతను తెలుపుతూ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జడ్.పి.హెచ్.ఎస్ సూరారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏం పురుషోత్తం రెడ్డి, ఉపాధ్యాయలు జరుపుల రవీందర్, సతీష్, వెంకటేశ్వర్లు, గంగిశెట్టి వెంకటేశ్వర్లు, మేరీ బాయ్, కవితా దేవి, సునీల్ చంద్రమౌళి, నగేష్, పాఠశాల బోధనేతర సిబ్బంది, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.