29-01-2025 11:44:44 PM
ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు టోర్నీ నిర్వహణ
చెన్నై: 23వ జాతీయ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 2025కు సంబంధించి బుధవారం చెన్నై వేదికగా అధికారిక లోగోతో పాటు మస్కట్‌ను విడుదల చేశారు. ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు జరగనున్న చాంపియన్‌షిప్ పోటీల్లో దేశవ్యాప్తంగా 1700 మంది పారా అథ్లెట్లు బరిలోకి దిగనున్నట్లు తెలిసింది. కార్యక్రమంలో పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా (పీసీఐ) సెక్రటరీ జయవంత్ గుండు, అర్జున అవార్డు గ్రహీత, పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ తులసిమతి మురుగేసన్ తదితరులు పాల్గొన్నారు. ఈ చాంపియన్‌షిప్‌ను జరిపేందుకు తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా తమిళనాడు పారా స్పోర్ట్స్ అసోసియేషన్‌తో చేతులు కలిపింది.