calender_icon.png 12 December, 2024 | 12:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రారంభం రోజే కస్టమర్కు షాక్ ఇచ్చిన నేషనల్ మార్ట్...!

12-12-2024 11:07:42 AM

గోధుమల కొనుగోలుపై అత్యధిక ధర వసూలు చేసిన వైనం. 

ఇదేంటని ప్రశ్నించిన కస్టమర్కు ఇంకా అప్డేట్ కాలేదంటూ జవాబు..

పోలీసులకు ఫిర్యాదు. 

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నూతనంగా ప్రారంభించిన నేషనల్ మార్ట్ మొదటి రోజే ఓ కస్టమర్కు షాక్ ఇచ్చింది.  ప్రారంభం రోజే మార్ట్లో కొనుగోలు చేసిన గోధుమలకి  కిలో41 రూపాయలు చొప్పున 7 కిలోల గోధుమలకి 287లకు బదులుగా కిలో 61 చొప్పున 434 రూపాయలు అధిక ధర వసూలు చేశారు. ఇదేంటని ప్రశ్నించిన సదరు కస్టమర్ కు నిర్లక్ష్యపు సమాధానం ఎదురైంది. ఇంకా అప్డేట్ కాలేదని డబ్బులు కూడా వాపస్ ఇవ్వడం కుదరదంటూ తెగేసి చెప్పాడు. దీంతో కస్టమర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన హజ్రత్ అనే వ్యక్తి బుధవారం జిల్లా కేంద్రంలో నూతనంగా ప్రారంభమైన నేషనల్ మార్ట్ లో గోధుమలతో పాటు మరికొన్ని వస్తువులు కొనుగోలు చేయగా కేంద్ర రాష్ట్ర జిఎస్టితో పాటు అధిక ధరలు వసూలు చేసినట్లు గుర్తించి కంగుతిన్నాడు. సిస్టం ఇంకా అప్డేట్ కాలేదని చెప్పిన జవాబుకి ఒకే రోజు వందల సంఖ్యలో లక్షల్లో వస్తువులు కొనుగోలు చేయగా వాటన్నింటిలో ఇంకా ఎంతమంది నష్టపోయారో తెలియాల్సి ఉంది. దీనిపై నేషనల్ మార్ట్ యాజమాన్యాన్ని సంప్రదించే ప్రయత్నం చేయగా అందుబాటులోకి రాలేదు.