calender_icon.png 4 March, 2025 | 1:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజీ మార్గమే.. రాజ మార్గం..!

03-03-2025 07:36:38 PM

రాజీపడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో రాజీ పడవచ్చు

సైబర్ నేరాలలో హోల్డ్ చేయబడిన డబ్బు తిరిగి బాధితులకు అందే విధంగా చూడాలి

మార్చి 8న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయండి

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యస్.హెచ్.ఒ లకు పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ  చెన్నూరి రూపేష్ 

సంగారెడ్డి,(విజయక్రాంతి): జాతీయ లోక్ అదాలతో రాజీమార్గంలో కేసులు పరిష్కారం చేసుకోవాలి జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్ తెలిపారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్టేషన్ హౌస్ ఆఫీసులతో మాట్లాడారు. ఈ నెల 8వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ ను పురస్కరించుకొని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నుండి జిల్లా పోలీసు అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ పలు సూచనలు చేశారు. జిల్లా వ్యాప్తంగా నమోదైన, రాజీ పడటానికి అవకాశం ఉన్నటువంటి, చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న అన్ని కేసులలో ఇరువర్గాలు రాజీపడేలా వారికి అవగాహన కల్పించాలన్నారు. సైబర్ నేరాలకు సంబంధించి బాధితులు కోల్పోయి హోల్డ్ చేయబడిన డబ్బు తిరిగి బాధితులకు చేరే విధంగా సంబంధిత బ్యాంక్ అధికారులకు కోర్టు ద్వారా ఉత్తర్వులు అందించాలని సూచించారు.

ఇ-పెట్టి కేసులు, మద్యం తాగి పట్టుబకడిన కేసులలో ఫైన్ అమౌంట్ చెల్లించే విధంగా చూడాలని అన్నారు. కానిస్టేబుల్ నుండి అధికారుల వరకు ప్రతి ఒక్కరు భాద్యతగా వివాహరించి, వీలైనన్ని ఎక్కువ కేసులు రాజీ పడేలా చూడాలన్నారు. జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. క్షణికావేశంలో చేసే తప్పులను సరిదిద్దుకోవాడానికి లోక్-అదాలత్ అనేది ఒక మంచి అవకాశం అని,  అనవసర గొడవలకు పోయి జీవితాలను ఇబ్బందులపాలు చేసుకోకూడదని అన్నారు. రాజీ మార్గమే రాజమార్గమని, రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం ఉన్న అన్ని కేసులల్లో ఇరు వర్గాలు రాజీ కుదుర్చకోవాలని ఎస్పీ గారు సూచించారు. ఈ కాన్ఫరెన్స్ లో అదనపు ఎస్పీ ఎ.సంజీవ రావ్, డియస్పీ వేణుగోపాల్ రెడ్డి,  డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ రెడ్డి,  కోర్టు లైజనింగ్ అధికారి సత్యనారాయణ తదితరులు ఉన్నారు.