calender_icon.png 26 February, 2025 | 8:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియం చేసుకోవాలి

26-02-2025 01:56:13 AM

జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.హెచ్.వి ఆర్.ఆర్ వర ప్రసాద్

కామారెడ్డి, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి):  జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కామారెడ్డి ఆధ్వర్యంలో  జాతీయ లోక్ అదాలత్ మార్చి 8న నిర్వహిస్తున్నట్లు  జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ వి ఆర్ ఆర్ వరప్రసాద్ తెలిపారు. కామారెడ్డి బార్ అసోసియేషన్ లో న్యాయవాదులతో సమావేశమయినారు. మంగళవారం కామారెడ్డి బార్ అసోసియేషన్ లో న్యాయ వాదులతో మాట్లాడారు.

జరగబోయే  జాతీయ లోక్ అదాలత్ లో మరింత  ఎక్కువ కేసులు పరిష్కరించడానికి  సహకరించాలి అని కోరారు. ముఖ్యంగా సివిల్ కేసులు, మోటర్ వెహికల్ ఆక్సిడెంట్ కేసులు, కంపౌండబుల్ క్రిమినల్ కేసులు ఈ లోక్ అదాలత్ లో పరిష్కరించడానికి సహకరించాలి అన్నారు.

ఈ సమావేశం లో న్యాయమూర్తులు అడిషనల్ జిల్లా జడ్జి లాల్సింగ్ శ్రీనివాస్ నాయక్, సెక్రటరీ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ టి. నాగరాణి.అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి దీక్ష,  బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గౌడ్, సీనియర్ న్యాయవాదులు, బార్ అసోసియేషన్ అడ్వొకేట్స్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ సూ పరింటెండెంట్ చంద్రసేన్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ ఖాజా సమీ ఉల్లాహ్  ఖాన్ పాల్గొన్నారు.