26-02-2025 12:00:00 AM
కొత్తగూడెం, ఫిబ్రవరి 25 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టులో మార్చి 8న జరిగే జాతీయ అదాలత్‌లో ఎక్కువ కేసుల పరిష్కారం కోసం కృషి చేయాలని జిల్లా న్యా య సేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి మంగళవారం ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులతో జరిగిన సమీక్ష సమావేశం లో తెలిపారు. ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు తమ కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని తెలిపారు.
మోటార్ వాహన ప్రమాద బాదితుల కేసులలో కక్షిదారులకు న్యాయం జరగాలని సూచించారు. లోక్ అదాలత్ లో రాజీపడటం వలన కక్షిదారులకు సమయం, డబ్బు వృధా కాదన్నా రు. ఇన్సూరెన్స్ కంపెనీ వారిగా పెండింగ్ లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవాలని న్యాయమూర్తి సూచించారు.
ఈ సమీక్షా సమావేశంలో కొత్తగూడెం మొదటి అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఏ.నీరజ, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎ. సుచరిత కొత్తగూడెం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్కినేని సత్యనారాయణ, డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ పి.నిరంజన్ రావు, ఇన్సూరెన్స్ కంపెనీకు సంబంధించి సీనియర్ న్యాయవాదులు గాదే రామచంద్ర రెడ్డి, రావి విజయ్ కుమార్, ఏ. రాంప్రసాదరావు, వి.నాగిరెడ్డి, అంబటి రమేష్, రాజమల్లు పాల్గొన్నారు.