calender_icon.png 25 February, 2025 | 4:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరిష్కారం చేసుకోండి.. ప్రశాంతంగా

25-02-2025 01:20:21 AM

-వచ్చేనెల 8వ తేదీన జాతీయ లోక్ అదాలత్ 

- బ్యాంకర్లతో న్యాయ అధికార సంస్థ జిల్లా కార్యదర్శి డీ. ఇందిరా

మహబూబ్ నగర్, ఫిబ్రవరి 24 (విజయ క్రాంతి) : ప్రతి కేసులో ఇరువురు ప్రత్యేకంగా చర్చించుకుని ఒక తాటిపై వస్తే పరిష్కార రూపం దాల్చుతుందని దీంతో ప్రశాంతంగా జీవించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని న్యాయ అధికార సంస్థ జిల్లా కార్యదర్శి డి. ఇందిరా అన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బీ పాపిరెడ్డి ఆదేశాల మేరకు వచ్చే నెల 8వ తేదీన నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో భాగంగా బ్యాంకు అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అధికార సంస్థ జిల్లా కార్యదర్శి డీ. ఇందిరా మాట్లాడారు.

మొత్తంలో బ్యాంక్ ప్రి లిటిగేషన్  కేసులను   పరిష్కరించుకోగలరని, మరియు కోర్టు లో పెండింగ్ లో ఉన్న బ్యాంక్‌కు సంభదించిన సెటిల్మెంట్ కు గుర్తించబడిన కేసులను జాతీయ లోక్ అదాలత్ లో పరిష్కారం చేసుకోవచ్చని తెలిపా రు.  కక్షిదారులను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని, తప్పకుండా వారి కేసులలో హాజరు  అయ్యేవిధంగా కృషి చేయగలరని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బ్యాంక్ మేనేజర్లు పాల్గొన్నారు.