calender_icon.png 5 March, 2025 | 10:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

14న జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి

11-12-2024 01:01:07 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): లోక్ అదాలత్ ద్వారా ఇరువర్గాల కక్షీదారులు అంగీకారయోగ్యమైన సత్వర పరిష్కారం పొందవచ్చునని, ఈనెల 14వ తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు బుధవారం తెలిపారు. రాజీమార్గం రాజమార్గమని, కక్షలు, కార్పణ్యాలతో ఏమీ సాధించలేమని, రాజీపడితే ఇద్దరూ గెలిచినట్లేనని సూచించారు. లోక్ అదాలత్ ద్వారా ఇరు వర్గాల కక్షీదారులు అంగీకారంతో సత్వర పరిష్కారం పొందవచ్చునని అన్నారు. పోలీస్ అధికారులు, కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుల్లు, పోలీస్ సిబ్బంది రాజీపడదగిన కేసులను గుర్తించి ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి రాజీ పడేటట్లు అవగాహన కల్పించాలని కోరారు.