సంగారెడ్డి అర్బన్,(విజయక్రాంతి): జిల్లా గ్రంథాలయ సంస్థ సంగారెడ్డి అధ్వర్యంలో జిల్లా కేంద్ర గ్రంథాలయం యందు 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవములు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంను గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు జి.అంజయ్య , గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వసుంధర, విశిష్ట అతిథి మాణయ్య , రిటైర్డ్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ లతో పాటు పాఠశాల విద్యార్థులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు .అనంతరం జవహర్ లాల్ నేహ్రు, రంగనాథన్, సరస్వతి చిత్రాలకు పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం పాఠశాల విద్యార్థులు ఒక్కొక్కరుగా ప్రసంగించారు, అనంతరం సంస్థ అధ్యక్షులు మాట్లాడుతూ యావత్ భారతదేశంలో బాలల దినోత్సవంను ఘనంగా జరుపుకొంటున్నారు. నాడు చదువుకొనుటకు పరిమిత స్థాయిలో పత్రికలు, పుస్తకాలు అందుబాటులో ఉండేవి, నేడు భారతదేశం అన్ని రంగాల్లో ముందుకు పోతున్న వేళ విద్యను అంది పుచ్చుకోవాలని, భావితరాలను మంచి ఉన్నతంగా నిర్మించుకోవాలని తెలిపారు, నారాయణఖేడ్ గ్రంథాలయం మరియు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో చదువుకుని ఏంతో మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని ప్రశంసించారు.