calender_icon.png 8 January, 2025 | 8:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయస్థాయిలో రాణించాలి

02-01-2025 01:23:39 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జాతీయస్థాయి హ్యాండ్ బాల్(National Level Handball) అత్యంత ప్రతిభ కనబరిచి సత్తా చాటాలని ఉమ్మడి జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు గోనే శ్యామ్ సుందర్ రావు(District President Gone Shyam Sundar Rao) అన్నారు. గతేడాది అక్టోబర్ నెలలో రంగారెడ్డి జిల్లా తొర్రూర్ లో జరిగిన 53వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సీనియర్ పోటీలలో ఆసిఫాబాద్ జిల్లా కెరమేరికి చెందిన మౌనిక, మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన రమ్య జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

క్రీడాకారులు ఈనెల 5 నుండి 9 వరకు బీహార్ రాష్ట్రంలోని పూర్ణియా(Purnia)లో జరిగే జాతీయస్థాయి పోటీలలో తెలంగాణ రాష్ట్ర జట్టు తరఫున పాల్గొననున్నారు. జాతీయస్థాయి క్రీడలకు వెళుతున్న విద్యార్థినిలను గురువారం అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు.  హ్యాండ్ బాల్ అసోసియేషన్  ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేష్, కోశాధికారి రమేష్ రెడ్డి,ఒలంపిక్ అసోసియేషన్ కార్యదర్శి రఘునాథ్ రెడ్డి, డివైఎస్ఓ రమాదేవి, డిఎస్ఓ మీనారెడ్డి, కోచ్ లు అరవింద్, కళ్యాణ్, శేఖర్, రాకేష్, సాయి, సీనియర్ క్రీడాకారులు అభినందించారు.