04-03-2025 12:00:00 AM
సరస్వతీ శిశుమందిర్ విద్యార్థిని ప్రతిభ
కరింనగర్, మార్చి 3 (విజయక్రాంత) : విద్యా భారతి ఢిల్లీ ద్వారా నిర్వహింపబడుతున్న అన్ని రాష్ట్రాలలోని సుమారు 25వేల శిశు మందిరాలలో చదువుతున్న బాల బాలికలకు ప్రతి సంవత్సరం వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరుగుతుంది. గత సంవత్సరం నామాల దేవి బాలవర్గలో ప్రథమ బహుమతి సాధించగా, ఈ సంవత్సరము ఐమన్ నాహది అయోధ్య నగర వైభవం అనే అంశంపై కిషోర వర్గలో ఆల్ ఇండియా లెవెల్ లో ప్రథమ బహుమతి సాధించడం జరిగింది.
ఈ విద్యార్థిని బహుమతి సాధించడం పట్ల పాఠశాల అధ్యక్షులు బల్మూరి కరుణాకర్ రావు, కార్యదర్శి ఇంజనీర్ కోల అన్నారెడ్డి, సమితి అధ్యక్షులు డాక్టర్ చక్రవర్తుల రమణాచారి, సమితి కార్యదర్శి ఎలగం దుల సత్యనారాయణ, విభాగ్ కార్యదర్శి మేచినేని దేవేందర్ రావు,
సహ కార్యదర్శి కొండ గంగాధర్, డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్, పులాల శ్యామ్, గట్టు శ్రీనివాస్, రాపర్తి శ్రీనివాస్, డాక్టర్ నళ్ల సత్య విద్యాసాగర్, తాటి రాజేశ్వరరావు, చందా సుధాకర్, శ్రీరాం మొండయ్య, కేశెట్టి మహేష్, బన్నా సుధాకర్, తదితరులు హర్షం వ్యక్తం చేశారని పాఠశాల ప్రధానాచార్యులు సముద్రాల రాజమౌళి తెలిపారు.
‘