యాదవ మహాసభ అధ్యక్షుడు రవీంద్రనాథ్ యాదవ్
హైదరాబాద్, జనవరి 24 (విజయక్రాంతి): జాతీయ స్థాయిలో కులగణన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ అధ్యక్షుడు చింతల రవీంద్రనాథ్ యాదవ్ తెలిపారు. జైపూర్‌లో జరిగిన అఖిల భారత యాదవ మహాసభలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన అనంతరం రవీంద్రనాథ్ శుక్రవారం యాదవ మహాసభ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో యాదవుల పాత్ర కీలకమన్నారు. సదర్‌ను రాష్ట్ర పండుగగా గుర్తించినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే జనగణనలో కులగణనను చేపట్టేందుకు జాతీయస్థాయిలో అఖిల భారత యాదవ మహాసభ ద్వారా తాము చర్చ చేపడతామని రవీంద్రనాథ్ పేర్కొన్నారు.