calender_icon.png 1 November, 2024 | 6:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాజ సేవకుడికి జాతీయ స్థాయి అవార్డు

14-08-2024 04:04:02 PM

కరీంనగర్: జిల్లాలోని చేగుర్తి గ్రామానికి చెందిన సమాజ సేవకుడు గాలి పెళ్లి రవీందర్ అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలోని భారతీయ విద్యాపీఠం యూనివర్సిటీ ప్రాంగణంలో కేంద్ర న్యాయశాఖ సాధికారిక శాఖ మంత్రి రాందాస్ అత్వాలే, భారతీయ విద్యాపీఠం, ఆల్ ఇండియా యూత్ టీం జినీత్ ఇంటర్నేషనల్ సంస్థ చైర్మన్ కల్చరల్ మేనేజర్ మితాలి కంబ్లి, చేతుల మీదుగా జాతీయ స్థాయి ఎక్స్లెన్స్ అవార్డును  అందుకున్నారు.

కరోనా కాలంలో కరీంనగర్ మండలంలోని ప్రతి గ్రామంలో అవగాహన కల్పిస్తూ అండగా నిలిచారు. కరోనా కాలంలో  గాలి పెళ్లి రవీందర్ కు ఆపద్బాంధవ రాష్ట్రస్థాయి అవార్డు కూడా లభించింది. ఎన్ఎస్ఎస్ జిల్లా స్థాయి శిబిరాల్లో సైతం జిల్లా స్థాయి అవార్డులను పొందాడు. రక్తదాన శిబిరాల్లో తన రక్తాన్ని దానం చేసి ఆదర్శంగా నిలిచాడు. తన సేవను గుర్తించి గాలిపెళ్లి రవీందర్ కు ఢిల్లీలో జాతీయస్థాయి ఎక్సలెన్స్ అవార్డును ప్రధానం చేశారు. గాలిపెల్లి రవీందర్ మాట్లాడుతూ.... నా సేవలను గుర్తించి ఇచ్చిన ఈ అవార్డు పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ జాతీయ స్థాయి అవార్డు నాకు ఇంకా బాధ్యతలను పెంచాయన్నారు. ప్రతి ఒక్కరూ సమాజం పట్ల సేవా దృక్పథం కలిగి ఉండాలి అన్నారు.