19-02-2025 04:40:14 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): రాజస్థాన్‌లో జాతీయ నీటిపారుదల మంత్రుల సదస్సు(National Irrigation Ministers Conference) బుధవారం జరిగింది. ఉదయపుర్ లో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్(Union Minister for Water Resources CR Patil) అధ్యక్షతన ఏర్పాటైన భేటీలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Telangana Irrigation Minister Uttam Kumar Reddy), ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ మోదిషా, ఛత్తీస్‌గఢ్ నీటిపారుదల మంత్రి కేదార్ కశ్యప్ పాల్గొన్నారు. ఈ నీటిపారుదల శాఖ మంత్రు సదస్సు(Irrigation Ministerial Conference)లో భాగంగా ఉదయపుర్ లో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్, దేబాశ్రీ ముఖర్జీ ఐఏఎస్, జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శిని బుధవారం కలిశారు.
సీతారామసాగర్ ప్రాజెక్టు అనుమతులు, మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ నివేదికపై చర్చ జరుగుతోంది. సాగర్ నీటీ వాడకంపై రాష్ట్ర అభ్యంతరాలను కేంద్రమంత్రి దృష్టికి తెచ్చిన ఉత్తమ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా సాగర్, శ్రీశైలం బ్యాక్ వాటర్ ను వాడుకుంటోందని చెప్పారు. సాగర్, శ్రీశైలం నీటి వాడకంపై 35 చోట్ల టెలిమోట్రీ ఏర్పాటు చేయాలని, తెలంగాణ ప్రయోజనాలకు ఇబ్బంది లేకుండా చూస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చారు.