calender_icon.png 1 February, 2025 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంగారెడ్డి చౌరస్తా నుంచి లింగంపల్లి వరకు జాతీయ రహదారి విస్తరణ

01-02-2025 12:00:00 AM

  1. 65వ నేషనల్ హైవే ఆరు లేన్లుగా నిర్మాణం
  2. రూ.800 కోట్లతో 30 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం 
  3. గ్రామాలు, చౌరస్తాల వద్ద ఫ్లుఓవర్లు, అండర్‌పాసులు, ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలు నిర్మించేందుకు ప్రతిపాదనలు 

సంగారెడ్డి, జనవరి 31 (విజయక్రాం తి) : వాహనదారులకు మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం 65వ జాతీయ రహదారిని ఆరు లైన్లుగా నిర్మా ణం చేస్తుంది. సంగారెడ్డి చౌరస్తా నుంచి లింగంపల్లి చౌరస్తా వరకు జాతీయ రహ దారిని ఆరు లేన్లుగా నిర్మాణ పనులు చేస్తుంది. ఆరు లైన్ల రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.800 కోట్లు మంజూరు చేసింది.

జాతీయ రహదారి విస్తరణ పనులు జోరుగా సాగుతున్న, వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. సంగారెడ్డి చౌరస్తా నుంచి 30 కిలోమీట ర్ల రోడ్డును ఆరు లైన్లుగా నిర్మిస్తున్నారు. 65వ జాతీయ రహదారి ముంబై టు హైదరాబా ద్,  161 జాతీయ రహదారి నాందేడ్ టు సంగారెడ్డి వరకు ఉన్న రెండు జాతీయ రహదారులు ఈ రహదారిలో కలుస్తున్నాయి.

దీంతో జాతీయ రహదారిపై వాహనా ల రాకపోకల సంఖ్య పెరిగిపోవడంతో ట్రాఫిక్ సమస్య భారీగా పెరిగిపోవడంతో ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగిన కిలోమీ టర్ల మేరకు వాహనాలు నిలిచిపోవలసిన పరిస్థితి ఉంది. దీంతో ట్రాఫిక్ సమస్యను పరిష్కారం చేసేందుకు ప్రభుత్వం జాతీయ రహదారిని ఆరు లేన్లుగా నిర్మాణం చేస్తుం ది.

రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం చేసేందుకు పోలీసులు సైతం తీవ్ర ఇబ్బందులు పడేవా రు. జాతీయ రహదారిపై ఫ్లు ఓవర్ బ్రిడ్జిలు, అందరు ప్రాసులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మాణం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రోడ్డుకు ఇరువైపులా వరద నీరు, మురికి నీరు ప్రవహించేందుకు కాలువల నిర్మాణం జోరుగా చేస్తున్నారు.

రోడ్డు పక్క న తవ్వకాలు చేయడం తో ప్రమాదాలు జరుగుతున్నా యి. ప్రమాదాలు జరిగే అవ కాశం ఉన్నచోట ఎలాంటి సూచి కలు ఏర్పాటు చేయలేదు. రోడ్డు నిర్మాణ పనులను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇంజనీరింగ్ అధికారులు పర్య వేక్షణ చేస్తున్నారు.

రాష్ర్ట ప్రభుత్వం జాతీ య రహదారి నిర్మాణం కోసం భూసేకరణ చేసి నష్టపరిహారం చెల్లించడంతో ఎక్కడ సమస్యలు రావడం లేదు. జాతీయ రహదా రికి ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించి రోడ్డు నిర్మాణం, తవ్వకాలు చేస్తున్నారు. 

ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం..

జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్య పరిష్కారం చేసినందుకు గ్రామాలు, చౌర స్తాల వద్ద ఫ్లుఓవర్ బ్రిడ్జిలు, అండర్ పాసు లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మాణం చేసేం దుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సంగా రెడ్డి చౌరస్తా నుంచి లింగంపల్లి వరకు హై స్పీడ్ హైవే రోడ్డు నిర్మాణం చేస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న షాపులు, షెడ్ల, భవనాలు తొలగిస్తున్నారు.

సంగారెడ్డి చౌర స్తా నుంచి హైదరా బాద్ వరకు వాహనాల సంఖ్య పెరిగిపో వడంతో ట్రాఫిక్ సమస్య పెరిగిపోయింది. ప్రయాణ సమయాన్ని తగ్గించేలా రోడ్డు నిర్మాణం చేస్తున్నారు. ఈ రోడ్డుకు రెండు జాతీయ రహదారులు లింకు ఉండడంతో వాహనాల సంఖ్య భారీగా పెరిగిపోయిం ది.

సంగారెడ్డి చౌరస్తా, కంది, ఐఐటి హైద రాబాద్, రుద్రారం, గణేష్ గడ్డ, లకుడా రం, ఇస్నాపూర్, నోపాన్ కమాన్ వద్ద ఫ్లు ఓవర్ బ్రిడ్జిలు నిర్మాణం చేయాలని ప్రతి పాదించినట్టు తెలిసింది. కొత్త రోడ్డుపై 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు వెళ్లేలా రోడ్డు నిర్మిస్తున్నారు. 

ప్రమాదాలు జరుగుతున్నా నివారణ చర్యలు శూన్యం..

సంగారెడ్డి చౌరస్తా నుంచి లింగంపల్లి చౌరస్తా వరకు రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న ప్రమాదాలు నివారించేం దుకు చర్యలు తీసుకోవడం లేదు. వాహన దారులకు ఇబ్బందులు కలగకుండా  రోడ్డు నిర్మాణం చేసే సమయంలో సూచికలు ఏర్పాటు చేయవలసి ఉంది. రోడ్డు నిర్మాణం జరగడం రోడ్డుకు ఇరువైపులా తవ్వకాలు చేయడంతో రోడ్డు ప్రమాదకరంగా మారి పోయింది.

గ్రామాలు, చౌరస్తాలు యూటర్నుల వద్ద సూచిక బోర్డులు లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదం జరి గే అవకాశం ఉన్న చోట ఎలాంటి సూచి కలు ఏర్పాటు చేయలేదు. రోడ్డు పనులు జరుగుతున్న సమయంలో సూచిక బోర్డు లు, రేడియం స్టిక్కర్లు లేకపోవడంతో ప్రమా దాలు జరుగుతున్నాయి.

రాత్రి సమయం లో రోడ్డు పక్కన వాహనాలు నిలపడంతో ఎక్కువగా ప్రమాదాలు  జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు నివారించే అధికారులు తగు చర్యలు తీసుకోవాలని వాహనదారు లు కోరుతున్నారు. ఎక్కువగా యూటర్న్ ఎలాంటి బోర్డులు ఏర్పాటు చేయకపోవడం తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రోడ్డు మధ్యలో ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు పడడంతో పాటు ప్రమాదాతకు గురవుతున్నారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు సూచిక బోర్డులు, రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయాలని వాహనదా రులు కోరుతున్నారు.