calender_icon.png 11 March, 2025 | 3:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేషనల్ హెల్త్ మిషన్ నిధులు పక్కదారి

11-03-2025 12:15:14 AM

  1. నిధులు రాకముందే పనులు 
  2. 2020- 2021 ఆర్థిక సంవత్సరంలో రూ 72 లక్షల గోల్ మాల్?
  3. పూర్తిస్థాయి విచారణ చేస్తే అక్రమాలు వెలుగులోకి 

భద్రాద్రి కొత్తగూడెం మార్చి 10,( విజయ క్రాంతి): కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తూ, నిరుపేదలకు నాణ్యమైన కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో అనేక పథకాలను రూపొందించి నిధులను మంజూరు చేస్తుంటే, క్షేత్రస్థాయిలో జిల్లాస్థాయి అధికారులు అక్రమాలకు పాల్పడుతూ నిధులు మింగేస్తున్నట్లు ఆరోపణలు వెలబడుతున్నాయి.

మారుమూల గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ (N HM) నిధులను విడుదల చేస్తోంది. 2020 --2021 ఆర్థిక సంవత్సరంలో మంజూరైన ఎన్ హెచ్ ఎం నిధులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పక్కదారి పట్టినట్లు ఆరోపణలు వెలుగుతున్నాయి. ఈ నిధులతో ఆస్పత్రుల్లో మైనర్ రిపేర్లు, అవసరమైన వస్తువులు, తాగునీటి సౌకర్యం కల్పించాల్సి ఉంది.

ఈ నిధులను ప్రభుత్వం నేరుగా డిఎంహెచ్వో ఖాతాలో జమ చేస్తుంటారు. ప్రధానంగా ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పన, ఆస్పత్రుల అభివృద్ధికి ఈ నెలలను ఖర్చు చేయాల్సి ఉంటుంది. వచ్చిన నిధులను డిఎం అండ్ హెచ్ ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులకు చెల్లించి ఖర్చు చేయాల్సి ఉంది.

ఆయా ఆస్పత్రుల్లో అవసరమైన మేరకు పనులు నిర్వహించి, వారు సంతృప్తి చెందిన తరువాత నిధులను డ్రా చేసి ఏజెన్సీకి ఇవ్వాల్సి ఉంది. నిబంధనలు ఏ విధంగా ఉంటే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నేరుగా నిధులను ఖర్చు ఆరోపణలకు దారితీస్తోంది. జిల్లాకు 2018-2019 సంవత్సరానికి రూ 72, 32,500,2019-2020 ఆర్థిక సంవత్సరంలో రూ.69,45,940 ఎన్ హెచ్ ఎం నిధులు మంజూరయ్యాయి.

వాటితో పనులు చేసి నిధులను డ్రా చేశారు. చెల్లించిన నిధుల వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్ సి నెంబర్ 71/ఎస్ పి ఎం యూ --ఎన్ హెచ్ ఎం/టీఎస్/2018-2019. నిధులను 2019 జనవరి 9న రూ 72,32,500 నిధులు, ఆర్ సి నెంబర్ 71/ఎన్ పిఎంయూ -- ఎన్ హెచ్ ఎం/టీఎస్ 3019-2020. 2020 ఏప్రిల్ 8న రూ 69,45,940 నిధులు ఖర్చు నిధులు.

ఆ తర్వాత ఏడాది 2020-2021 ఆర్థిక సంవత్సరంలో ఎన్ హెచ్ ఎం నిధులు విడుదల కాకముందే పనులు నిర్వహించినట్టు రికార్డులు సృష్టించి, పనులు చేయకుండానే నిధులు డ్రా చేయడమే ఇక్కడి ట్విస్ట్. అందుకు అధికార రికార్డుల్లో ఆర్ సి నెంబర్ 71/ఎస్ పి ఎం యు-ఎన్ హెచ్ ఎం/టీఎస్/2018-19 సంవత్సరం నిధులు 2019,జనవరి 9న రూ 72, 32,500 డ్రా చేసిన అధికారులు, అదే ఆర్ సి నెంబర్తో 2020-21 సంవత్సరం నిధులు ఖర్చు చేసినట్టు చూపటం అక్రమాలను తేటతెల్లమ్ చేస్తుంది.

ప్రభుత్వం నిధులునే విడుదల చేయలేదు, ఉన్న నిధులను పనులు చేయకుండా చేసినట్లు రికార్డు సృష్టించి, పాత ఆర్సి నెంబర్ తో నిధులు డ్రా చేయడం జాతీయ హెల్త్ మిషన్ నిధులు గల్లంతు అవుతున్నాయనడాన్ని ధ్రువపరుస్తోంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో జరుగుతున్న అనేక అక్రమాలలో ఇది ఒక మచ్చుతునక మాత్రమే. ఇంకా అనేక రకాలైన అక్రమాలు ఉన్నట్లు ఆరోపణలు వెలబడుతున్నాయి.

జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, ఎస్ డి హెచ్ ఎస్ ఆస్పత్రులకు అన్నింటికి వీటిని ఖర్చు చేయాల్సి ఉంటుంది. అక్రమాల్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, అప్పటి డిఎం మెన్ హెచ్ ఓ పరిపాలన అధికారి ప్రధాన పాత్రధారులను ఆరోపణలు వస్తున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్ కల్పించుకొని నేషనల్ హెల్త్ మిషన్ నిధుల అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది.

ఈ విషయమై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భాస్కర్ నాయకుడు వివరణ కోరగా నేషనల్ మిషన్ హెల్త్ నిధుల్లో ఎలాంటి గోల్మాల్ జరగలేదని, పనులు జరిగిన వాటికే నిధులు డ్రా చేసి ఇచ్చామని తెలిపారు. వైద్యాధికారులే వాటిని ఖర్చు చేశారన్నారు.