calender_icon.png 16 January, 2025 | 11:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రత్నం వడికిన కలెక్టర్ పమేలా సత్పతి

07-08-2024 05:27:39 PM

కరింనగర్: నేత కార్మికుల కష్టంతో వెలువడే ఉత్పతులను ప్రచారం చేయడానికి మనకన్నా పెద్ద బ్రాండ్ అంబాసిడర్లు ఉండారన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం చేనేత,జౌళి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా హజరయ్యారు..  కలెక్టర్ ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా మాట్లాడుతూ.. చేనేత కార్మికుల కష్టంతో వెలువడే ప్రతి ఉత్పాదనకు వారే బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలని, ఆ దిశగా వారిద్వారా ఉత్పత్తి కాబడే వస్త్రాలను వారే దరిస్తూ వాటి ద్వారా సమకూరే సౌకర్యాలను గురించి వారే ప్రచారం చేయాలని పేర్కొన్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో చేనేత స్టాల్ ను ఏర్పాటుకు నేత కార్మికులు సుముకంగా ఉన్నట్లయితే స్టాలను ఏర్పాటు చేసే అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు.  నేత కార్మికుల ద్వారా ఉత్పత్తి కాగా మిగిలిన వాటితో చిన్న చిన్న బ్యాడ్జీల వంటి వాటిని కూడా ఉత్పత్తి చేసి వాటిని రాష్ట్ర, జాతీయ ఫార్మేషన్ డే కార్యక్రమంలో వినియోగించేలా నేత కార్మికులు కృషి చేయాలని తెలిపారు.