29-01-2025 12:36:10 AM
ఆకట్టుకున్న తెలంగాణ బృందం పరేడ్
డెహ్రాడూన్: 38వ జాతీయ క్రీడల ప్రారంభోత్సవ వేడుకలు మంగళవారం డెహ్రాడూన్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీ య క్రికెట్ స్టేడియంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో తెలంగాణ తరఫున 23 క్రీడా విభాగాల్లో 212 మంది క్రీడాకారులతో కూడిన కాంటిజెంట్ బృందం పరేడ్‌లో పాల్గొంది. చీఫ్ ది మిషన్ సోనిబాల నేతృత్వంలో డిప్యూటీ చీఫ్ ది మిషన్ మహేశ్వర్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, శివసేనారెడ్డి, సంజీవ రెడ్డి పాల్గొన్నారు.
వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని సంప్రదాయ క్యాప్‌తో పాటు శాల్వా, మస్క ట్ ‘మాలి’తో కూడిన మొమొంటోను ఆవిష్కరించారు. కార్యక్రమంలో భారత ఒలింపి క్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉష, కామన్‌వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ చీఫ్ క్రిస్ జెన్‌కిన్స్ హాజరయ్యారు. జాతీయ క్రీడల మస్క ట్ ‘మాలి’ని ప్రదర్శించారు. ఈసారి ‘గ్రీన్ గేమ్స్’ను థీమ్‌గా పేర్కొన్నారు. మొత్తం 32 క్రీడాంశాల్లో 10వేల మంది అథ్లెట్లు పోటీ పడనున్నారు.