రామగిరి,(విజయక్రాంతి): గణతంత్ర దినోత్సవం(Republic Day) రోజున ఆర్జీ-3 పరిధిలోని ఓసీపీ-2 ప్రాజెక్ట్ కార్యాలయం(OCP-2 Project Office)లో జాతీయ జెండా(National Flag) ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించకుండా జాతీయ జెండాను అవమానించారు. సింగరేణి అధికారిక కార్యాలయాల్లో స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలకు జెండాను ఆవిష్కరించి గౌరవించడం ఆనవాయితీ. కానీ సెంటినరీ కాలనీలో గల ప్రాజెక్ట్ కార్యాలయంలో పీఓ కార్యాలయంతో పాటు ఎక్సప్లోరేషన్ జీఎం కార్యాలయంతో పాటు వీటిసీ కార్యాలయం కలిపి మూడు వేర్వేరు విభాగాలున్నాయి. అయినా జెండాను ఆవిష్కరించకుండా జాతీయ జెండాను అవమానించి ఘోర అపరాధానికి పాల్పడ్డారు. జాతీయ జెండాను ఆవిష్కరించకుండా భారత రాజ్యాంగ అమలుకు ప్రతీక అయిన జెండాను అవమానించిన బాధ్యులపై చర్యలు చేపట్టాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై సింగరేణి ఉన్నతాధికారులు ఏం చర్యలు చేపడుతారో వేచిచూడాలి.