calender_icon.png 24 December, 2024 | 1:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరినాట్లు వేసిన విద్యార్థులు..

23-12-2024 08:26:05 PM

రామాయంపేట: నిజాంపేట మండల పరిధిలోని నగరం తండా గ్రామంలో జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల విద్యార్థులచే వరి నాట్లు వేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమారాణి మాట్లాడుతూ.. దేశానికి వెన్నుముక రైతు అని, రైతు పండించిన పంటని మనం తింటున్నామని రైతు యొక్క ప్రాముఖ్యత విద్యార్థులకు తెలియపరుస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటేశ్, కల్పన సోనా పాల్గొన్నారు.