హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 14 (విజయక్రాంతి): ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు కామ్రేడ్ సుభాష్ లాంబాజీ, ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కుమార్‌జీ అధ్యక్షతన నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ బుధవారం టీఎన్జీవో కేంద్ర సంఘం యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల సమక్షంలో ముగిశాయి. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై తీర్మానం చేశారు. ముఖ్యంగా సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో టీఎన్జీవో సెంట్రల్ యూనియన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ ఎస్‌ఎమ్ హుస్సేని(ముజీబ్) తదితరులు పాల్గొన్నారు.