calender_icon.png 8 November, 2024 | 12:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ విద్యావిధానాన్ని తిరస్కరించాలి

08-11-2024 01:01:09 AM

విద్యాకమిషన్‌కు టీఎస్ యూటీఎఫ్ విజ్ఞప్తి

హైదరాబాద్, నవంబర్ 7 (విజయక్రాంతి): జాతీయ విద్యావిధానం- 2020ను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించాలని టీఎస్ యూటీఎఫ్ కోరింది. విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళితో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, యూటీఎఫ్ నేతలు చావ రవి, కె.జంగయ్య తదితరులు గురువారం సమావేశమై ప్రభుత్వ విద్యమై చర్చించారు. ఈ సందర్భంగా పలు అంశాలను చైర్మన్ దృష్టికి వారు తీసుకెళ్లినట్లు తెలిపారు.

ప్రభుత్వ బడుల్లో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించి, నాణ్యమైన మధ్యాహ్న భోజనం తోపాటు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం స్నాక్స్ అందించా లని కోరారు. డీఈవో, డిప్యూటీ ఈవో, ఎంఈవో పోస్టులను మంజూరు చేసి భర్తీ చేయాలని తెలిపారు. తరగతికొక టీచర్ ఉండాలని, మోడల్ స్కూళ్లను విద్యాశాఖలో విలీనం చేయాలని కోరారు. దీనిపై చైర్మన్ ఆకునూరి మురళి స్పందిస్తూ పాఠశాలల అభివృద్ధికి గ్రేడింగ్ ఇవ్వాలని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు వారు తెలిపారు.