కరీంనగర్, ఫిబ్రవరి 2 (విజయ క్రాంతి): శాతవాహన విశ్వవిద్యాల యంలో అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యం లో వికసిత్ భారత్-2047 ఇండియా విజన్ ఫర్ డెవలప్మెంట్ అనే అంశంపై ఈ నెల 4, 5 తేదీల్లో రెండు రోజుల పాటు జాతీయ సదస్సు నిర్వహించ నున్నట్లు సెమినార్ డైరెక్టర్, అర్థశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ కోడూరి శ్రీవాణి తెలిపారు.
ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృ ష్ణారెడ్డి, శాతవాహన ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్, జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకుల పతి ప్రొఫెసర్ అద్దాస్ జానయ్య, కాకతీయ విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ప్రొఫెసర్ ఆర్ సాయన్న, కాకతీయ విశ్వవిద్యాలయ యూనివర్సి టీ కళాశాల ప్రిన్సిపాల్, సీనియర్ ఆచార్యులు ప్రొఫెసర్ సురేష్ లాల్ హాజరుకానున్నారని పేర్కొన్నారు.