calender_icon.png 9 January, 2025 | 2:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుంచి ఐఐఎంసీలో నేషనల్ కాన్ఫరెన్స్

09-01-2025 12:24:01 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 8 (విజయక్రాంతి): కళలు, సామాజిక శాస్త్రాలు, పరిశోధన, సాంకేతికతలో డిజిటల్ ఆవిష్కరణలపై ఈ నెల 9, 10 తేదీల్లో ఐఐఎంసీలో రెండు రోజుల పాటు జాతీయ స్థాయి సదస్సు జరగనుంది. దేశంలోని వివిధ విద్య విభాగాలపై ప్రముఖ విద్యావేత్తలు, పరిశోధకులు, విద్యార్థులు డిజిటల్ టెక్నాలజీల రూపాంతర ప్రభావాన్ని అన్వేషించడానికి ఈ సెమినార్ దోహదపడుతుందన్నారు.

ఈ సదస్సును ఐఐఎంసీ చైర్మన్ ప్రొఫెసర్ వీ విశ్వనాథం ‘డిజిటల్ ఆవిష్కరణల పాత్ర’ అనే అంశంపై కీలక ఉపన్యాసం చేసి ప్రారంభించనున్నారు. రెండు రోజుల సదస్సులో దేశవ్యాప్తంగా పరిశోధకులు అనేక పత్రాలను సమర్పిస్తారని అన్నారు. ‘సాంస్కృతిక వారసత్వ సంరక్షణపై డిజిటల్ మీడియా ప్రభావం’ నుంచి ‘సామాజిక శాస్త్ర పరిశోధనలో బిగ్‌డేటా పాత్ర’ వరకూ అనేక అంశాలపై చర్చలు ఉంటాయన్నారు.