21-04-2025 12:00:00 AM
రూ.కోటి పారితోషికం
యాచారం ఏప్రిల్ 20 : జాతీయ స్థాయి లో రంగారెడ్డి జిల్లా, యాచారం మండలం, మాల్ గ్రామపంచాయతీ ఉత్తమ గ్రామ పం చాయతీగా ఎంపికయింది. ఆత్మ నిర్బార్ విభాగంలో ఎంపిక చేసినట్లు యాచారం ఎంపీడీవో నరేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కోటి రూపాయలు నగదు పారితోషికం ఇచ్చారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ.ప్రతి సంవత్సరం దేశంలో గ్రామ పంచాయతీలకు పనితీరు బట్టి వివిధ కేటగిరీలో ఎంపిక చేసి ఉత్తమ గ్రామపంచా యతీలుగా ప్రకటిస్తారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో యాచారం మండలంలో మాల్ గ్రామపంచాయతీ ఉత్తమ అవార్డు, అందుకోవడం ఆయన హర్ష వ్యక్తం చేశారు. మండల అధికారులను గ్రామపంచాయతీ సెక్రటరీ ఎర్ర రాజును, పారిశుద్ధ్య కార్మికుల ను ఆయన అభినందించారు.