2022 డిసెంబర్ 31 నాటికి సెన్సార్ అయిన సినిమాలకు అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. 2022 డిసెంబర్ 31వ తేదీ నాటికి సెన్సార్ అయిన సినిమాలకు ఈ అవార్డులను అందించారు. ఈ నేష నల్ ఫిల్మ్ అవార్డ్స్ దర్శకుడు ఆనంద్ ఇకర్షి తెరకెక్కించిన మలయాళ చిత్రం ‘ఆట్టం’ దక్కించుకుంది. తెలుగు నుంచి చందు మొండేటి దర్శక త్వం వహించిన ‘కార్తికేయ2’ మాత్రమే ప్రాంతీయ చిత్రం కేటగిరిలో అవార్డు గెలుచుకుంది. ఈ దఫా పూర్తిగా మలయాళ, తమిళ సినిమాలదే ఆధిపత్యం కొనసాగింది. ఇక ఉత్తమ నటుడిగా కన్నడ హీరో రిషబ్ శెట్టి (కాంతార) అందుకోనున్నాడు.
ఉత్తమ నటిగా నిత్యా మీనన్ (తిరుచిట్రంబళం హీరోయిన్ మానసి ఫరేఖ్ (కచ్ ఎక్స్‌ప్రెస్ ఎంపికయ్యారు. ఉత్తమ దర్శకుడిగా సూరజ్ బర్జాత్యా (ఉంచాయి నిలిచారు. ఉత్తమ జాతీయ చిత్రంగా అవార్డుకు ఎంపికైన ‘ఆట్టం’కు మరో రెండు కేటగిరిల్లోనూ అవార్డులు వరించాయి. బెస్ట్ ఎడిటింగ్ (మహేశ్ భవనేండ్); బెస్ట్ స్క్రీన్‌ప్లే (ఒరిజిన ల్ ఏకార్షి) దక్కించుకుందీ సినిమా. గుజరాతీ చిత్రం ‘కచ్ ఎక్స్‌ప్రెస్’కు ఉత్తమ నటి అవార్డుతోపాటు మరో మూడు కేటగిరి ల్లో అంటే.. బెస్ట్ ఫిల్మ్ ప్ర మోటింగ్ నేషన్; సోష ల్, ఎన్విరాన్‌మెంటల్ వా ల్యూస్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ (నిక్కి జోషి)లలో పురస్కారాలు దక్కాయి.
తమిళ సినిమా ‘తిరుచిత్రాంబళం’కు ఉత్తమ నటి అవార్డుతో పాటు బెస్ట్ కొరియోగ్రఫీ (జానీ మాస్టర్, సతీశ్ కృష్ణన్) అవార్డుకూ ఎంపికైంది. హరియాన్వీ చిత్రం ‘ఫౌజా’కు మొత్తం నాలుగు పురస్కారాలు దక్కాయి. వాటి లో ఉత్తమ దర్శకుడు (పరిచయం) ప్రమోద్ కుమార్; ఉత్తమ సహాయ నటుడు పవర్ రాజ్ మల్హోత్రా; బెస్ట్ లిరిక్స్ (రచయిత సదన్ ఖాన్) ఉన్నాయి. కన్నడ చిత్రం ‘కాంతార’ను బెస్ట్ హోల్‌సమ్ ఎంటర్‌టైన్‌మెంట్ కేటగిరి అవార్డు వరించగా, మరో కన్నడ చిత్రం ‘కేజీఎఫ్2’ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. హిందీ చిత్రం ‘ఉంచాయి’కి ఉత్తమ సహాయ నటి కేటగిరిలోనూ (నీనా గుప్తా) అవార్డు వచ్చింది.
తమిళ సినిమా ‘పొన్నియిన్ సెల్వన్’ పార్ట్ మొత్తం నాలుగు విభాగాల్లో పురస్కారాలు గెలుచుకుంది. బెస్ట్ సినిమాటోగ్రఫీ (రవి వర్మన్); బెస్ట్ సౌండ్ డిజైన్ (ఆనంద్ కృష్ణమూ ర్తి); ఉత్తమ నేపథ్య సంగీతం (సంగీత దర్శకుడు: ఏఆర్ రెహమాన్)తోపాటు ప్రాంతీయ చిత్రం విభాగాల్లో అవార్డులు వరించాయి. హిందీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర అవార్డులు వచ్చాయి. నాన్ ఫీచర్ సినిమాలకు కూడా కేంద్రం అవార్డులు ప్రకటించింది.
అవార్డులు ఇలా (ఫీచర్ సినిమాలు)
ఉత్తమ చిత్రం: ఆట్టమ్ (మలయాళం)
ఉత్తమ నటుడు: రిషబ్ శెట్టి (కాంతార కన్నడ)
ఉత్తమ నటి: నిత్యా మీనన్ (తిరుచిట్రంబళం-తమిళం, మానసి ఫరేఖ్ (కచ్ ఎక్స్‌ప్రెస్ -గుజరాతీ)
ఉత్తమ దర్శకుడు: సూరజ్ బర్జాత్యా (ఉంచాయి -హిందీ)
బెస్ట్ లిరిక్స్: ఫౌజా (హరియాన్వీ), రచయిత: నౌషద్ సదన్ ఖాన్
ఉత్తమ సంగీతం (పాటలు): బ్రహ్మాస్త్ర: శివ (హిందీ) ప్రీతమ్
ఉత్తమ సంగీతం (నేపథ్యం): పొన్నియిన్ సెల్వన్ (తమిళం), సంగీత దర్శకుడు: ఏఆర్ రెహమాన్
ఉత్తమ ప్రాంతీయ చిత్రాలు
ఒడియా: దమన్
మలయాళం: సౌది వెళ్లక్క సీసీ 225/2009 మరాఠీ: వాల్వీ (ది టైర్మెట్)
కన్నడ: కేజీఎఫ్2
హిందీ: గుల్‌మోహర్
బెంగాళీ: కబేరి అంతర్దాన్
తెలుగు: కార్తికేయ 2
తమిళం: పొన్నియిన్ సెల్వన్
పంజాబీ: బాగీ డి దీ
స్పెషల్ మెన్షన్: గుల్‌మోహర్ (హిందీ), నటుడు: మనోజ్ బాజ్‌పాయ్; కదికన్ (మలయాలళ), సంగీత దర్శకుడు: సంజోయ్ సలీల్ చౌదురి
బెస్ట్ టివా ఫిల్మ్: సికాసిల్