calender_icon.png 29 April, 2025 | 7:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ బీసీ విద్యార్థి సంఘం నాయకులు ముందస్తు అరెస్ట్

29-04-2025 01:04:51 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు మంగళవారం జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో జాతీయ బీసీ విద్యార్థి సంఘం నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారు. మంచిర్యాల పోలీసులు బీసీ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నస్పూర్ అఖిల్,  శ్రావణ్, రాజ్ కుమార్ ను అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా నస్పూర్ అఖిల్ మాట్లాడుతూ బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థుల ఫిజు బకాయిలు  వెంటనే విడుదల చేయాలని. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా ఇంత వరకీ ఒక స్కాలర్షిప్ కూడా విడుదల చేయలేదన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తును గుర్తుంచుకొని ఫీజు బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో  తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.